కార్మికులతో గోక్కుంటే... టీఆర్ఎస్ ఇంటికి పోవాల్సిందే... ! బీజీపీ లక్ష్మణ్
ఆర్టీసీ కార్మీకులతో గోక్కుంటే టీఆర్ఎస్ ఇంటికి పోవాల్సిందేనని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు సమానంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని, ఇప్పుడు కార్మికుల విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ మెడలు వంచి, కార్మికులకు అండగా ఉంటామని అయన ప్రకటించారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రభుత్వానికి బుద్ది చెబుతామని అన్నారు.

టీఆర్ఎస్ ఉద్యోగాలు ఉడగొడుతాం
కార్మీకులపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న పరాకాష్టకు ఇది నిదర్శనం ఆయన మండిపడ్డారు. గత నెలరోజుల క్రితం కార్మీకులు సమ్మె నోటీసును ఇస్తే స్పందించని సీఎం కేసీఆర్ ,వారిని ఉద్యోగం తీసేందుకు మాత్రం ముందుకు వచ్చారని అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఒక్క నిర్ణయంతో 50వేల కుటుంబాలను రోడ్డుపై పడేస్తే తెలంగాణ ప్రజాస్వామిక వాదులుగా చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి టీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడుతామని హెచ్చరించారు.
ప్రభుత్వ విధానాలే కారణం
ఇక ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే అయన విమర్శించారు. కార్మీకుల ఫీఎఫ్ డబ్బులను వాడుకోవడంతో పాటు డిజిల్‌పై పన్నులను విధించడం నుండి విద్యార్థుల బస్‌పాస్‌లకు సంబంధించి ప్రభుత్వం బకాయిలను చెల్లించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పాసుల బకాయిలే 2500 కోట్ల రుపాయాలు ఉన్నాయని చెప్పారు. లక్ష కోట్ల రుపాయాల ఆస్తులున్న ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

సీఎం నిరంకుశ వైఖరే.. సమ్మెకు కారణం
సీఎంకు కార్మీకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం లేదని ఇందుకోసమే కార్మీకులు నెలరోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా సీఎం పట్టించుకోలేదని అన్నారు. పండగ ముందు ప్రజలు ఇబ్బందిపడకుండా కార్మీకులతో పిలిచి మాట్లాడేందుకు కూడ ముందుకు రాలేదని దుయ్యబట్టారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ ద్రోహులకు కట్టబెడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రవాణాశాఖ మంత్రి అజయ్ కార్మీకులపై ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడంపై ఆయన మండిపడ్దారు. తెలంగాణను అడ్డుకున్నవాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారని మండిపడ్డారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications