కిషన్, లక్ష్మణ్.. పదవులు అటు ఇటు?: ఖమ్మం టిడిపిలో మిగిలేది నామా ఒక్కరే?

హైదరాబాద్: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి స్థానంలో పార్టీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్‌ను నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పుకొనేందుకు లక్ష్మణ్ సిద్ధంగా లేరని తెలుస్తోంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. కానీ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో జాప్యం తదితర కారణాల రీత్యా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక జరగలేదు. రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం పరస్పరం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.

పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి, బీజేపీఎల్పీ నేత పదవిని పరస్పరం మార్చాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ఖాళీగా ఉంచడం సబబు కాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోందని తెలుస్తోంది.

BJPLP Dr K Laxman in Telangana BJP chief race

పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ను నియమించి శాసనసభాపక్ష నేతగా అనుభవజ్ఞుడైన కిషన్ రెడ్డిని నియమించాలనే వాదన వినిపిస్తోందని సమాచారం. లక్ష్మణ్ మాత్రం ఫ్లోర్‌లీడర్ పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరని, పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఖమ్మంలో టిడిపి ఖాళీ?

తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి చెందిన కీలక నేతలు కారు ఎక్కుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టిడిపి దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సోమ, మంగళవారాల్లో జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా జిల్లాలోని పెద్ద నాయకులు టిడిపిని వీడి తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్, ఆయన అనుచరులు, భారీ సంఖ్యలో మైనారిటీలు తెరాసలో చేరాలని నిర్ణయించారని తెలుస్తోంది. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్‌రావు కూడా కారెక్కేందుకు సిద్ధమయ్యారు.

మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు. పొట్ల నాగేశ్వర్ రావుతోపాటు మరికొందరు తెరాసలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి తరఫున ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లంతా ఇప్పటికే అధికార కారు ఎక్కారు. ఈ నేపథ్యంలో టిడిపికి ఖమ్మంలో మిగిలేది నామా నాగేశ్వర రావు ఒక్కరేనా అనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+