ముస్లీం రిజర్వేషన్ బిల్లు: టైర్లలో గాలి తీసేశారు, బీజేవైఎం నేతల అరెస్ట్
తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రాధాన్య అంశంగా ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బిల్లులను ప్రవేశపెడుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రాధాన్య అంశంగా ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బిల్లులను ప్రవేశపెడుతోంది.
ముస్లీం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బీజేవైఎం ఆదివారం ఆందోళనకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ గేట్ వద్ద పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టైర్లలో గాలి తీసేశారు
రాణిగంజ్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు రెండుమూడు వాహనాలలో గాలి తీసేశారు. రాజ్యాంగ వ్యతిరేకమైన మతప్రాతిపదిక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వారు ఈ చర్యకు పాల్పడ్డారు.

అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
మతప్రాదిపదికన రిజర్వేషన్లను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారు పాదయాత్ర నిర్వహిస్తారు.
బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న బీజేవైఎం నాయకుల అరెస్ట్ పిరికిపందల చర్య అని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని, దీనిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ సభ్యులు కోటకొండ రాము డి మాండ్ చేశారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వినర్ ఆంజనేయులు, సభ్యులు మల్లేష్, జోనల్ ఇనచార్జీ రాజు, బాలకృష్ణ, నవీన, యుగేందర్, గోపాల్‌రాజ్ తదితరులు పొల్గొన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications