ఐ.టి దాడుల్లో 280 కోట్లు నల్లధనం స్వాధీనం,ఆదాయ వివరాలు వెల్లడించాల్సిందే
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 280 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ఆధాయపు పన్నుశాఖాధికారులుప్రకటించారు.
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 280 కోట్ల నల్లధనం స్వాథీనం చేసుకొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోని సుమారు 15 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ఆదాయపు పన్నుశాఖాధికారులు చెప్పారు.
పెద్దనగదు నోట్లను నవంబర్ 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. హైద్రాబాద్ లో మాత్రం సుమారు 18 చోట్ల తనిఖీలు నిర్వహించినట్టు ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో మొత్తం 1346 కోట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.అక్రమంగా ధనాన్ని దాచుకొన్న వారిపై ఆదాయపు పన్ను శాఖతో పాటు ఈడీ ,సిబిఐలు కన్నేసినట్టు అదికారులు ప్రకటించారు.

ఒక బ్యాంకులో 7.5 కోట్ల నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు సంపాదనకు సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారుడు అధికారులకు వెల్లడించకపోవడంతో స్వాధీనం చేసుకొన్నారు.ఖాతాదారులు తమ ఆదాయ వివరాలను ఖచ్చితంగా వెల్లడించాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు కోరారు.
జన్ ధన్ ఖాతాల్లోనూ, ఎక్కువగా డిపాజిట్లు లేని ఖాతాల్లో పెద్ద నగదు నోట్లు రద్దు చేసిన తర్వాత ఎక్కువ మొత్తం నగదు జమ కావడాన్ని నిశీతంగా పరిశీస్తున్నట్టు ఆధాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు. అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలకు సంబందించిన వివరాలను తెలపాలని బ్యాంకులను కోరినట్టు ఐటి శాఖాధికారులు
వెల్లడించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications