Blue Fog: రుషికొండ బీచ్‌కు తిరిగొచ్చిన బ్లూఫాగ్ గుర్తింపు, ఎలాగంటే?
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్ల్లూఫాగ్ గుర్తింపు రద్దయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, బ్లీఫాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తూ పత్రాన్ని బ్లూఫాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు శనివారం అందించారు. రాష్ట్రంలో బ్లూఫాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషకొండకు పేరుంది. అయితే, గతంలో ఈ గుర్తింపు రద్దయింది.
రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్‌గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తోంది. కొంతకాలంగా బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటి జరిగాయి. ఇక, టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు సరిగా లేవని.. నిర్వహణ అధ్వానంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో బ్లూఫాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బ్లూఫాగ్ హోదా కొనసాగేలా చర్యలు తీసుకుంది. బీచ్‌పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలను చేపట్టింది. బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
బీచ్ పరిశుభ్రతపై పర్యటకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అంతేగాక, రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా పేర్కొంటూ పలువురు అధికారులపై ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యటక శాఖ తీసుకున్న చర్యలతో పర్యటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో రుషికొండకు దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యటకుల తాకికి కూడా పెరగనుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications