హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటిపై దాడి.. కాళ్లు, చేతులు కట్టేసి.. వ్యభిచారం చేయాలని..

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన బాలీవుడ్ నటిపై కొందరు దుండగులు దాడికి పాల్పాడ్డారు. ఆమె బస చేసిన హోటల్ లోకి ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఏం జరిగింది..?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటి హైదరాబాద్ లోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఈనెల 18న ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో బస చేశారు. అయితే ఈనెల 21న రాత్రి 9 గంటల సమయంలో ఆమె హోటల్ లో నిద్రిస్తున్న వేళ ఇద్దరు అమ్మాయిలు రూమ్ లోకి వచ్చారు. తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు.

Bollywood Actress Attacked in Hyderabad Gang Escapes with Rs 50 000 and Gold

మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు అబ్బాయిలు ఆమె గదిలోకి చొరబడ్డారు. వాళ్లిద్దరూ ఆమెను రేప్ చేసేందుకు యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాళ్లు,చేతులు కట్టేసి హింసించారు. అనంతరం ఆమె బ్యాగులోని రూ. 50,000 నగదు, కొంత బంగారంతో అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+