హైటెక్ సిటీలో సైబర్ టవర్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: హైదరాబాదులోని హైటెక్‌సిటీలో గల సైబర్ టవర్స్‌లో బాంబు పెట్టామని మరికొద్ది సేపట్లో అది పేలుతుందంటూ కొందరు ఆకతాయిలు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హుటాహుటిన సైబర్ టవర్స్‌కు చేరుకున్న బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి అది ఉత్తదేనని నిర్ధారించారు. దీంతో సైబర్‌టవర్స్‌లో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఫోన్ చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఫిల్మ్ నగర్‌లో సోదాలు
హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలో పోలీసులు సోదాలు చేపట్టారు. ధనికుల ఇళ్లలో బాలకార్మికులు ఉన్నారనే సమాచారంతో కార్మికశాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఇప్పటివరకు ముగ్గురు బాలకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీల నుంచి బాలకార్మికులను పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాల్లకల్ దగ్గర ఆటోను లారీ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications