Bonalu Festival 2026: బోనాల పండగొస్తుంది.. షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ఏటా ప్రతిష్టాత్మకంగా బోనాల పండగ జరుగుతుంది. తెలంగాణ బోనాలు పండగకు దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. తెలంగాణను పరిపాలించిన కాకతీయులు, కుతుబ్ షాహీల కాలం నుంచి ఈ పండగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటా ఆషాడ మాసంలో జరిగే ఈ వేడుకలు ఘంటాల ఊరేగింపులు, నృత్యాలు, భవిష్యవాణి, రంగం తదితర కార్యక్రమాలతో దాదాపు నెల రోజులపాటు భాగ్యనగరం అంతటా కోలాహలంగా ఉంటుంది. అయితే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే సి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఓ సారి చూస్తే..
జూలై 19, 2026 ఆదివారం రోజున అమ్మవారి ఘటోత్సవం: సాయంత్రం 4:00 గంటలకు అమ్మవారి ఘటాల ఊరేగింపు (ఎదురుకోలు) ఉంటుంది. ఈ కార్యక్రమంతో లష్కర్ బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఆగస్టు 2, 2026 ఆదివారం రోజున ప్రధాన బోనాల ఉత్సవం.. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పిస్తారు.

అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక రంగం కార్యక్రమం ఆగస్టు 3, 2026 సోమవారం రోజున ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను అర్చకులు కోరారు. అయితే బోనాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. బోనాల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications