లైంగిక వాంఛ తీర్చలేదని తల , మొండం వేరు చేశాడు

మహబూబాబాద్:లైంగిక వాంఛ తీర్చాలని వివాహితను పలుమార్లు కోరాడు. ఆమె అంగీకరించలేదు. మద్యం మత్తులో ఉన్న బొంద్యా వివాహిత వినోదను లైంగిక వాంఛను తీర్చాలని కోరాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. తల నుండి ఆమె మొండాన్ని వేరు చేశాడు. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకొన్న ఈ ఘటనలో నిందితుడు బొంద్యాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

మహబూబాబాద్ జిల్లా పొనుగోడు శివారు టేకుల తండాకు చెందిన భూక్య వినోదను తునికి బొంద్యా అత్యంత కిరాతకంగా ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. వినోదను హత్య చేసిన తర్వాత నిందితుడు బొంద్యా పారిపోయాడు.

అయితే వినోదను ఇతర కారణాలతో హత్య చేసినట్టుగా తొలుత భావించారు. కానీ లైంగిక వాంఛ తీర్చలేదనే కారణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.

లైంగిక వాంఛ తీర్చలేదని వినోద హత్య

లైంగిక వాంఛ తీర్చలేదని వినోద హత్య

మహబూబాబాద్ జిల్లా పొనుగోడు శివారులోని టేకుల తండాకు చెందిన భూక్య వినోదను రెండు రోజుల క్రితం తల నుండి మొండెం వేరు చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు బొంద్యా. భూక్య రమేశ్‌, వినోద దంపతులు. వీరి పక్కనే బొంద్యా కూడ మరో పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.వినోదపై కన్నేసిన బొంద్యాలు లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. ఆమె నిరాకరించింది. రెండు రోజుల క్రితం కూడ ఆమె లైంగిక వాంఛ తీర్చేందుకు నిరాకరించడంతో బొంద్యాలు వినోదను పొలంలోనే కత్తితో మెడకోసి చంపేశాడు. తలను మొండెం నుండి వేరు చేశాడు. వినోదను చంపేసి పారిపోయాడు.

మోటార్ దొంగతనం

మోటార్ దొంగతనం

రమేష్, బొంద్యాల పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. అయితే పొలానికి నీటి విడుదల విషయంలో ఇద్దరికి గొడవలు జరిగాయి. దీంతో మోటార్, స్టార్టర్లు దొంగతనం జరిగిన విషయమై బొంద్యాలుతో రమేష్ గొడవ పెట్టుకొన్నాడు. అయితే ఈ విషయమై పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడ నిర్వహించారు. దీంతో వినోదను లైంగికంగా లోబర్చుకోవాలని బొంద్యా ప్లాన్ చేశాడు.

పంచాయితీ పెట్టారని లైంగికంగా వేధింపులు

పంచాయితీ పెట్టారని లైంగికంగా వేధింపులు

మోటార్, స్టార్టర్ దొంగతనం విషయమై పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టారనే అక్కసుతో రమేష్ కుటుంబంపై బొంద్యాలు పగను పెంచుకొన్నాడు. అయితే ప్రతి రోజూ పొలం వద్దకు వచ్చి పనిచేసే వినోదను శారీరకంగా లొంగదీసుకోవాలని బొంద్యాలు ప్లాన్ చేశాడు. ఈ విషయమై బొంద్యాలు వినోదను వేధించడం ప్రారంభించాడు. అయితే వినోద మాత్రం లొంగలేదు. దీంతో వినోదను హత్య చేయాలని బొంద్యాలు మనసులో పథకాన్ని రచించుకొన్నాడు.

లైంగిక వాంఛ తీర్చలేదని చంపేశాడు

లైంగిక వాంఛ తీర్చలేదని చంపేశాడు

ఫిబ్రవరి 17వ, తేదిన ఉదయం పూట తన పొలంలో పత్తిని తీసేందుకు వినోద వచ్చింది. అయితే అదే సమయంలో తన పొలంలో కూడ బొంద్యాలు ఉన్నాడు. వినోద ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన బొంద్యాలు వినోదను లైంగిక వాంఛను తీర్చాలని కోరాడు. ఆమె తిరస్కరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బొంద్యాలు వినోదపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటిస్తూ కిందపడిపోయింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు బాధితురాలి చేతులను తొక్కిపట్టి కత్తితో మెడను కోసేశాడు. మొండం నుండి తలను వేరు చేసి పారిపోయాడు. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని నిందితుడు పారిపోయాడు. మంగళవారం నాడు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+