అభిమానానికి ..బానిసత్వానికి తేడావుంది : కుట్రలు చేసారు - బూర సంచలనం..!!

టీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నికల వేళ భారీ షాక్. టీఆర్ఎస్ మాజీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేసారు. నల్గొండ జిల్లాకు చెందిన బీసీ నేతగా ఉన్న నర్సయ్య గౌడ్ తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. ఆ లేఖలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.

తాను ఒక వైద్యుడిగా టీజాక్ లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి..ఆ తరువాత భువనగిరి నుంచి ఎంపీగా పని చేసే అవకాశం దక్కిందని గుర్తు చేసారు. భువనగిరి ఎంపీగా శక్తి వంచన లేకుండా నియోజకవర్గం కోసం పని చేసానని చెప్పారు. ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలు తన పైన లేవన్నారు. పార్టీ బలోపేతానికి పని చేసానని వివరించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గెలుపు కోసం పని చేశానని చెప్పారు. 2019 ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇచ్చినా..అంతర్గత కుట్రల వలన తాను ఓడిపోయానని..అయినా పార్టీ కోసం ఇప్పటి వరకు భరించానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ప్రజా సమస్యల పైన కలిసి విన్నవించే ప్రయత్నం చేసినా కనీసం కలిసేందుకు కూడా సీఎం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించిన సమయంలో అసహనం వ్యక్తం చేయటం తనకు బాధ కలిగిందని సీఎంకు రాసిన లేఖలో నర్సయ్య గౌడ్ వివరించారు.

Boora Narasiah Goud Resigned for TRS, Sensational comments in letter to CM KCR

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన అవసరం పార్టీకి లేదని తెలిసిందన్నారు. అనేక అంశాలు పార్టీని డామేజ్ చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేసినా..ఆ అశవకాశం దక్కలేదన్నారు. ఇక, పార్టీలో ఉండి ఏం ఉపయోగమని ప్రశ్నించారు. తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్, ఇతర ప్రాంతాల టీడీఎస్ అంత ఉండటం లేదని భావిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఉద్యమకారులు సీఎం ను కలవాలంటే పెద్ద ఉద్యమమే చేయాల్సి వస్తోందని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

మునుగోడు టికెట్ అంశం తనకు సమస్యే కాదని, బీసీలకు టికెట్ అవకాశం పరిశీలించండి అంటూ అడగటమే నేరం అయితే..ఇక పార్టీలో ఉండటమే అనవసరమని నర్సయ్య గౌడ్ అసహనం వ్యక్తం చేసారు. తెలంగాణలో బీసీలు వివక్షకు గురి కావటం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ పైన అభిమానంతో ఉన్నానని, కానీ అభిమానానికి ..బానిసత్వానికి తేడావుందని లేఖలో వివరించారు. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని లేఖలో చెప్పుకొచ్చిన బూరా నర్సయ్య గౌడ్ తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+