హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. 3వేల మందికి ఉద్యోగాలు
తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రాబోతంది. జన్మనీకి చెందిన బాష్ ( Bosch ) సుమారు 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు.
హైదరాబాద్‌లో బాష్ సంస్థ పెట్టుబడులు
ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, మొబిలిటీ, గృహోపకరణాల్లో ప్రపంచ అగ్రగామిగా బాష్ సంస్థ ఉంది. తమ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు. బాష్ రాకలో సుమారు 3వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.

జర్మనీ వెలువల అది పెద్ద సెంటర్
జర్మనీ వెలువల అది పెద్ద గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదారాబాద్‌లోనే బాష్ నెలకొల్పబోతుంది. ఈ సంస్థ అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో సుమారు రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు బాష్ ప్రతినిధులు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ సంస్థ పెట్టుబడులు, ప్రభుత్వ రాయితీలు, ఇతర అంశాలపై సంప్రదింపులు జరిపారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

2025 నాటికి అందుబాటులోకి..
హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న బోష్ సంస్థ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. ఇది పూర్తియితే ఈ సంస్థ జర్మనీ బయట ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ కు కేంద్రంగా హైదరాబాద్ అవతరించనుంది. అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో బోష్ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications