పొలిటికల్ బౌన్సర్లు.. కాంగ్రెస్ ఖర్చెంతో తెలుసా..!

హైదరాబాద్ : పబ్బుల్లో, సెలబ్రిటీల కార్యక్రమాల్లో కనిపించే బౌన్సర్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయం అంటే వాళ్లేదో పోటీచేస్తారని కాదు.. నేతలకు అండదండలు అందిస్తున్నారన్నమాట. నల్లని డ్రెస్సులో కండలు తిరిగిన దేహధారుడ్యంతో భయానకంగా కనిపించే బౌన్సర్లు సాధారణంగా పబ్బులు, బార్ల దగ్గర గొడవలు జరగకుండా విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలకు వరంగా మారారు.

పొలిటికల్ సేవలు అందించడం బౌన్సర్లకు కొత్తేమీ కాదు.. కానీ ఈసారి ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీలు బౌన్సర్లను నియమించుకున్నాయి. పార్టీ కార్యాలయాల దగ్గర పోలీసులతో పాటు వీరు సెక్యూరిటీగా ఉంటున్నారు. అసంతృప్తులు నిరసనలకు దిగి ఆస్తినష్టం కలిగించకుండా చూసుకోవడం వీరి బాధ్యత.

టికెట్ల పంచాయితీ.. బౌన్సర్లకు గిరాకీ

టికెట్ల పంచాయితీ.. బౌన్సర్లకు గిరాకీ

మహాకూటమిలో భాగంగా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సిరావడంతో.. కాంగ్రెస్ లో టికెట్లు ఆశిస్తున్నవారికి మొండిచేయి మిగులుతోంది. మరోవైపు పారాచూట్లకు, కొత్తవారికి టికెట్లివ్వడం సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఎన్నికల వేళ గాంధీ భవన్ రణరంగం తలపిస్తోంది. టికెట్ల కోసం నిరసనలు మిన్నంటడంతో పోలీసుల సాయం తీసుకున్న పార్టీ పెద్దలు.. అటు బౌన్సర్లను కూడా నియమించారు. దాదాపు 18 మంది షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

అటు బంజారాహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం దగ్గర బౌన్సర్ల హడావిడి కనిపిస్తోంది. టికెట్లు దక్కని అసంతృప్తులు ఉత్తమ్ ఇంటిని ముట్టడించే ఛాన్సుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బౌన్సర్లను మోహరించారు. పోలీసులు సెక్యూరిటీగా ఉన్నా కూడా వందలాది మంది ఒక్కసారిగా అటాక్ చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా 10 నుంచి 20 మంది వరకు బౌన్సర్లు ఉన్నట్లు సమాచారం.

బౌన్సర్లతో సెక్యూరిటీ భలే.. ఖర్చు మాత్రం తడిసిమోపెడు..!

బౌన్సర్లతో సెక్యూరిటీ భలే.. ఖర్చు మాత్రం తడిసిమోపెడు..!

బౌన్సర్లను నియమించి ఊపిరి పీల్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు.. ఖర్చు మాత్రం తడిసిమోపెడవుతోందట. ఒక్కొక్క బౌన్సర్ కు రోజుకి వెయ్యి రూపాయలకు పైగానే చెల్లిస్తున్నారు. దీంతో పాటు వారికి భోజనం, ఇతరత్రా సదుపాయాలు అన్నీకలిపి లెక్క పెరుగుతోందట. దాదాపు రోజుకి లక్షకు పైగానే వెచ్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ఈ ఖర్చులు చెల్లిస్తున్నారో? లేదంటే మీరు చూసుకోండని ఎవరినైనా పురమాయించారో?

బౌన్సర్లను సమకూర్చేలా ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. తొలి జాబితా విడుదల మొదలు అలా కంటిన్యూ అవుతున్నారు బౌన్సర్లు. అయితే హైకమాండ్ నిర్ణయంపై పార్టీశ్రేణులు భగ్గుమంటున్నారు. పార్టీ కార్యాలయం దగ్గర బౌన్సర్లను పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలుగా తమను పార్టీ కార్యాలయంలోనికి రానివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బౌన్సర్లకు మంచి డిమాండ్

బౌన్సర్లకు మంచి డిమాండ్

ఎన్నికల వేళ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. గతంలో కూడా పొలిటికల్ పార్టీలు బౌన్సర్లను నియమించుకున్నా.. ఈసారి టికెట్ల పంచాయితీ దృష్ట్యా బౌన్సర్ల వినియోగం పెరిగింది. అదలావుంటే ప్రచారపర్వంలో భాగంగా కొందరు అభ్యర్థులు కూడా బౌన్సర్లను వాడుకుంటూ "గన్ మెన్" ముచ్చట తీర్చుకుంటున్నారు. దీంతో బౌన్సర్ల కొరత ఏర్పడి.. జిమ్ ల్లో కండలు పెంచే యువతకు అవకాశాలు లభిస్తున్నాయి. రోజుకి వెయ్యికి పైగానే ఆదాయం వస్తుండటంతో వారు కూడా బౌన్సర్లుగా రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.

అదలావుంటే ఎన్నడూలేని విధంగా ఈసారి పొలిటికల్ బౌన్సర్ల వినియోగం పెరగడంతో.. ఎకనామిక్స్ లెక్కలు కుదరడం లేదు. డిమాండ్ - సప్లై సరితూగడం లేదు. ఆయా పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు సైతం బౌన్సర్లను నియమించుకోవడంతో కొరత ఏర్పడింది. ఎలక్షన్ల సమయంలో మంచి గిరాకీ దొరుకుతుండటంతో సెక్యూరిటీ ఏజెన్సీలు ఇతర ప్రాంతాల నుంచి బౌన్సర్లను రప్పిస్తున్నాయట. ఇక ఎన్నికల పర్వంలో చివరి రెండు మూడు రోజులు కీలకంగా మారడంతో వీరికి మరింత డిమాండ్ పెరుగుతుందనేది ఒక అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+