హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిజోరాం అమ్మాయి పట్ల హైదరాబాదులో అసభ్య ప్రవర్తన

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిజోరం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల యువతి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -1లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది.

రోజు మాదిరిగానే గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఆటోలో బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ -10లోని క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దిగి నందినగర్‌లోని తన గదికి నడిచి వెళ్తోంది.

Boy arrested for abusing girl in Hyderabad

అయితే, కొన్ని రోజులుగా సరూర్‌నగర్ చెందిన ఎస్‌కె మౌలాలి ఆమెను వెంబడిస్తున్నాడు. అలా వెంబడిస్తూ వస్తున్న అతను గురువారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కల వాళ్ల మౌలాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మౌలాలి పంజగుట్టలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హౌస్ కీపింగ్ చేస్తున్నాడు. కాగా, నిందితుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

English summary
An youth Moulali abused a 23 year old girl from Mizoram at Banjarahills in Hyderabad has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X