నగ్నంగా తిరుగుతూ విద్యార్థినులపై వేధింపులు
హైదరాబాద్: నగ్నంగా తిరుగుతూ పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని హైదాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు రోడ్డుపై నడిచి వస్తుంటే వేధించడం పనిగా పెట్టుకున్నాడు.
విద్యార్థినులు రోడ్ నెంబర్ 10 అవర్ ప్లేస్ హోటల్ వైపు నుంచి నడిచి వస్తుంటారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన దీపక్ తన ఇద్దరు అనుచరులతో కలిసి నిత్యం విద్యార్థినుల వెంట పడుతున్నారు.

తన దుస్తులు విప్పేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ అనుచరుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications