సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి (ఫోటోలు)

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలి ఓ చిన్నారి మృతి చెందాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదే ఘటనలో ఇంటి పక్కనే ఉండే మరో ఏడాదిన్నర వయసు కలిగిన బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అమ్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఈ విషాద సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం..

అంబర్‌పేట డివిజన్ ఆకాశ్‌నగర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్, కమర్ బేగం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ఫిరోజ్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరి మూడో సంతానం పర్వేజ్ (4) ఇటీవలే అంబర్‌పేట సీపీఎల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు.

పర్వేజ్ అమ్మమ్మ ముంతాజ్‌బేగం (56) బాగ్‌అంబర్‌పేట కుమ్మరివాడీలో నివాసముంటోంది. అమ్మమ్మ ఇంటికి వెళ్తానని పర్వేజ్ మారాం చేయడంతో సోమవారం అతన్ని అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. మంగళవారం ఉదయాన్నే పర్వేజ్ పర్వేజ్ స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు.

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

ఈ క్రమంలో మనువడికి పాలు వేడిచేసి ఇస్తానని ముంతాజ్ బేగం ఇంట్లో ఉన్న 5 కేజీల చిన్న సిలిండర్ స్టౌవ్‌ను అంటించింది. వెంటనే గ్యాస్ లీక్ అవడంతో పాటు స్టౌవ్ కింది భాగంలో చిన్నగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆమె ఇంటి బయటకు సిలిండర్ స్టౌవ్‌ను తెచ్చి పెట్టి దానిపై ఇసుకను పోసింది.

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

అయినప్పటికీ మంటలు ఆరిపోకపోవడంతో పక్కనే బకెట్‌లో ఉన్న నీటిని స్టౌవ్‌పై కుమ్మరించింది. దీంతో క్షణాల్లో భారీ శబ్ధంతో సిలిండర్ పేలింది. ఇంటి ముందు ఆడుకుంటున్న మనవడు పర్వేజ్‌‌కు పేలిన సిలిండర్ ముక్కలు తగిలి కుడి చేయి తెగి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

 సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

అదే సమయంలో ఇంటి పక్కన నివాసముంటున్న షేక్‌మహ్మద్, రిజ్వాన్‌బేగం దంపతుల కుమారుడు షేక్ హాజీ (18నెలలు) అక్కడే ఉండటంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనలో పర్వేజ్ అమ్మమ్మ ముంతాజ్ బీ రెండు కాళ్లకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

ప్రస్తుతం ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందడంతో సీఐ ఆనంద్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రవి దర్యాప్తు ప్రారంభించారు.

 సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అంబర్ పేట ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి స్థానికి కార్పోరేటర్ పద్మావతితో కలిసి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముంతాజ్ బీ, హజీని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ. 5వేల ఆర్ధిక సహాయం అందించారు.

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

సిలిండర్ పేలి చిన్నారి మృతి: అల్లంత దూరం తెగిపడ్డ చేయి

అయితే రాయితీ గ్యాస్‌ను చిన్న సిలిండర్లలో రిఫీల్లింగ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. అంబర్‌పేటలో గల్లీగల్లీలో చిన్న సిలిండర్లను ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రీఫిల్లింగ్ జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాలకు భారీ నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+