వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో యాపిల్ మాపింగ్ సెంటర్ ప్రారంభం, కేటీఆర్ 'కట్టప్ప' ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ పెట్టిన సస్పెన్స్ ను బద్దలు కొట్టే ప్రయత్నాల్లో భాగంగా.. ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు. తాజాగా యాపిల్ తమ కంపెనీకి సంబంధించిన డెవలపింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో నెలకొల్పిన విషయం తెలిసిందే. యాపిల్ సంస్థ తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మంది వరకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి.

సరిగ్గా ఇదే విషయాన్ని అంచనా వేస్తూ.. మంత్రి కేటీఆర్ గురువారం చెప్పబోయే గుడ్ న్యూస్ కూడా ఇదే అయి ఉండొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు.

విమానాశ్రయం నుంచి నేరుగా నానక్ రామ్ గూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో నెలకొల్పిన యాపిల్ కార్యాలయానికి చేరుకున్నారు టిమ్ కుక్. అక్కడ డిజిటల్ మాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టిమ్ కుక్, తమ సంస్థ ఉత్పత్తి చేస్తోన్న ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వాచ్ లపై రాబోయే రోజుల్లో దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

breaks for ktr suspense

హైదరాబాద్ లో యాపిల్ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ట ఆనందం వ్యక్తం చేసిన సీఈవో టిమ్ కుక్, సంస్థ ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అందుకు అవసరమైన ప్రతిభ గల నిపుణులు హైదరాబాద్ లో ఉన్నారని వారితో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని తెలియజేశారు.

ఇక దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. యాపిల్ సంస్థ హైదరాబాద్ లో తమ కార్యాలయాలన్ని స్థాపించడం సంతోషకరమన్నారు. ప్రపంచ అత్యుత్తమ కంపెనీల్లో యాపిల్ ఒకటి అని చెప్పిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ప్రోయాక్టివ్ విధానానికి ఇది నిదర్శనమన్నారు. దీని ద్వారా వేలమందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని ఆశాభఆవం వ్యక్తం చేశారు.

breaks for ktr suspense

ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు తమకు గర్వకారణమని ఆర్ఎంఎస్ఐ సీఈఓ జిందాల్ తెలిపారు.

గుడ్ న్యూస్‌పై కేటీఆర్ ట్వీట్

నేను చెప్పాలనుకుంటున్న బిగ్ న్యూస్ ఏంటని అడుగుతున్న వారికి నా సమాధానం ఇదేనని.. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే బిగ్ న్యూస్... నాక్కూడా తెలియదు' అని కేటీఆర్ గురువారం నాడు సరదాగా ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా హీరో దగ్గుబాటి రానా వద్ద తెలుసుకోవాలని సూచించారు.

English summary
Its an interesting news about ktr that he announced he is going to tell a good news to telangana on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X