హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్: 14మందిపై కేసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫిలింనగర్ రోడ్‌నంబర్ 1లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 14 మందిపై కేసులు నమోదు చేశారు.

ఎనిమిది ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదైన వారికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Breath analyser test for Jayaprada's car driver

కాగా, శుక్రవారం రాత్రి ఓ విందులో పాల్గొని సినీ నటి జయప్రద తన కారులో ఇంటికి బయల్దేరారు. ఆమె కారు డ్రైవర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించారు. అయితే డ్రైవర్ మద్యం సేవించలేదని నిర్ధారణ అయ్యింది.

నెక్లెస్‌రోడ్‌లో పోలీసుల తనిఖీలు

నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వేగంగా వాహనాలు నడుపుతున్న 76మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేగంగా వాహనాలు నడుపుతూ వాకర్స్‌ను ఇబ్బంది పెడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెతిపారు.

English summary
Breath analyser test held for Actress and former MP Jayaprada's car driver in Hyderabad on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X