బీఆర్కే భవన్‌లో ఉద్యోగికి కరోనా పాజిటివ్: హోం క్వారంటైన్‌లో ఏడో అంతస్తు సిబ్బంది..
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతీరోజు సెంచరీ మార్క్ దాటుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కవగా వస్తున్నాయి. సిటీ నడిబొడ్డున గల బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉద్యోగులు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏడో అంతస్తును రెండుసార్లు శానిటైజ్ చేస్తామని పేర్కొన్నారు.
ఏడో అంతస్తులోని సిబ్బందికి వైరస్ సోకింది. దీంత వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఎనిమిదో అంతస్తు ఆర్థికశాఖ కార్యాలయంలో సిబ్బంది రావడం లేదు. కొందరు మాత్రమే ఆఫీసుకు వస్తున్నారు. మిగతా వారంతా భయపడుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 132 కేసులు నమోదవుయ్యాయి. మొన్న 200 కేసులు రికార్డవడంతో ఆందోళన నెలకొంది. ఆదివారం 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 137కి చేరింది.
Recommended Video
రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 3500 మార్క్ దాటింది. నిన్నటివరకు 3650 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో వైరస్ తగ్గి 1742 మంది డిశ్చార్జయి.. ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన 1771 మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం చనిపోయిన 14 మందితో కలిపి 137 మంది మృతిచెందారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications