బ్రోతల్ హౌస్: నిర్వహకారులితో పాటు మహిళ, విటుడి అరెస్టు

హైదరాబాద్: ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ సమీపంలోని హయత్‌నగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఓ మహిళను, విటుడ్ని అరెస్టు చేశారు. శనివారంనాడు ఈ సంఘటన జరిగింది.

prostitution

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - గుడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్‌లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకుని వచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పూర్‌కు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+