చెల్లె పైనే కన్నేశాడు: సోదరిని రేప్ చేసిన సోదరుడు..
మొదటి భార్యకు జన్మించిన కుమార్తె(16) వీరితోనే ఉంటోంది. ఇదే క్రమంలో రెండో భార్య కుమారుడి(17) కన్ను ఆమె మీద పడింది.
హైదరాబాద్: చదువుకోవాల్సిన వయసులో చిన్నారుల ఆలోచనలు గాడి తప్పుతున్నాయి. నిండా పద్దెనిమిదేళ్లు కూడా రాని బాలురు సైతం లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి తపిస్తుండటం శోచనీయం. వావి వరుసలు సైతం లెక్క చేయకుండా.. తోడబుట్టినవారి పైనే అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుండటం ప్రతీ ఒక్కరిని కలవర పెడుతోంది.
తాజాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్టలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గుల్షన్ ఎక్బాల్ కాలనీలో 17ఏళ్ల ఓ బాలుడు, 16ఏళ్ల తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుల్షన్ ఎక్బాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు జన్మించిన కుమార్తె(16) వీరితోనే ఉంటోంది. ఇదే క్రమంలో రెండో భార్య కుమారుడి(17) కన్ను ఆమె మీద పడింది.
సోదరి అన్న కనీస మానవత్వం లేకుండా.. శనివారం నాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనానంతరం బాధితురాలు తన తల్లికి విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి ఆదివరాం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications