అన్యాయం చేశారు..సెల్ఫీ వీడియో చేసి బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి ఆత్మహత్యా యత్నం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇంకా రాష్ట్రంలో ఎన్నికల వేడి చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్లను ఎంపిక చేసే ప్రక్రియలో గెలిచిన పార్టీలు మునిగిపోయాయి. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఓట్ల లెక్కింపులో తనకు అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ లోని 54 డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిని మాదాసు పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు.

తన బ్యాలెట్ పేపర్లను దాచిన సిబ్బంది

మొన్న శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. తనకు చెందిన 100 బ్యాలెట్ పేపర్లను సిబ్బంది ప్యాంటు జేబులో దాచుకున్నారు అని అభ్యర్థిని ఆరోపించారు. ఒక ఉద్యోగి కి ఫోన్ కాల్ రాగా బయటకు వెళ్లి బ్యాలెట్ కట్టను దాచారని ఆమె తెలిపారు.

brs candidate suicide attempt over election counting irregularities alleged on election staff over ballot papers

సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ యత్నం

ఎన్ని మార్లు కోరిన బ్యాలెట్ కట్టలు డబ్బాలో వేయకుండా సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బలవంతంగా తనతో సంతకాలు తీసుకున్నారని మాదాసు పద్మ పేర్కొన్నారు.ఈ అక్రమాల పైన తాను లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. దీంతో తన తీవ్ర మనస్తాపం చెందిన ఆమె కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో లో పేర్కొన్నారు.

తనకు న్యాయం జరగకుంటే ఎక్కడికైనా వెళ్తా అంటున్న మాదాసు పద్మ

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ కాగా, హుటాహుటిన ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. ఈ ఘటన పైన భద్రాద్రి కలెక్టర్ కు శనివారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన క్రమంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో మాదాసు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని, ఎక్కడి వరకైనా వెళతానని ఆమె తేల్చి చెబుతున్నారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ పీఠం సీపీఐ.. కాంగ్రెస్ పొత్తులతో

ఈ వ్యవహారం పైన అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో హంగు ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ సిపిఐ మధ్య చర్చలు జరిగాయి కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థికి మేయర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+