Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ప్రకటన....!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలు తెలంగాణలో మూడు పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సమీకరణాలే ప్రాధాన్యతగా నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలు ప్రతిష్టాత్మకం
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సీఎం రేవంత్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోను మెజార్టీ స్థానాలు దక్కించుకునే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. బిజెపి సైతం ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మెజార్టీ సీట్ లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

BRS chief KCR announces all the contesting candidates for lok sabha in 17 seats

అభ్యర్థుల జాబితా
అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కెసిఆర్ కు ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు, తన హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ, కవిత అరెస్టుతో కేసిఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీ భవిష్యత్తుకు కీలకంగా మారాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో కేసీఆర్ తన అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేశారు. అందులో ఓసీలకు 6, బీసీలకు 6, 3 ఎస్సీ, ఒక ఎస్టి వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ సీట్లను కేటాయించారు.

BRS chief KCR announces all the contesting candidates for lok sabha in 17 seats

మెజార్టీ సీట్ల పై గురి
ఈసారి బిజెపి కూడా తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల సైతం ఖరారయ్యారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వీరిని కొనసాగించేందుకు రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇతర పార్టీలకు భిన్నంగా అభ్యర్థుల విషయంలో కెసిఆర్ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడంతో పార్టీ భవిష్యత్తు కోసం ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. దీంతో కేసిఆర్ ఎంపిక చేసిన అభ్యర్థులతో ప్రచారం కొనసాగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+