నేరుగా రంగంలోకి కేసీఆర్ - బిగ్ టర్న్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఈ రోజున బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా లో తొలిసారి అసెంబ్లీకి రానున్నారు.
అసెంబ్లీకి కేసీఆర్
ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ తొలి సారి అసెంబ్లీకి హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలి సమావేశానికి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమా ణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై మళ్లీ చర్చ మొదలైంది.

సభలో బడ్జెట్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈనెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినా, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ ఒత్తిడితో మరో రెండు రోజులపాటు సభను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
కేసీఆర్ ఎంట్రీతో
ఆగస్టు 1, 2న కూ డా సభను నిర్వహించాలని నిర్ణయించారు. రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, వ్యవసాయ కమిషన్ తదితర వాటికి సభ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో సభను మరో రెండు రోజులు పొడిగించినట్టుగా తెలిసింది. అసెంబ్లీతో పాటుగా శాసనమండలి సమావేశాలు కూడా రెండు రోజులు జరగనున్నాయి. ఇక, సభలో హోరా హోరీగా సాగుతున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం వేళ కేసీఆర్ సభకు వస్తుండటంతో...సభలో చోటు చేసుకొనే చర్చలు..పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications