కవిత, కేజ్రీవాల్ అరెస్టులపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని కేసీఆర్ అభివర్ణించారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. 4
ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పని చేస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఎమ్మెల్సీ కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటుందని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆప్ మంత్రులు, నేతలు ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్‌ది ఒకదారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మరోదారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి.. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పని చేయడం లేదన్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ, మోడీకి అనుకూలంగా పని చేస్తున్నారని మరోసారి తేటతెల్లమైందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తన స్వప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications