అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం...!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ పైన సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ నేతలు మండి పడ్డారు. ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన తరువాత తమకు స్పందించే అవకాశం ఇవ్వకపోవటం పైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. కాగా, రేపు BRS భవన్‌లో కృష్ణా జలాలపై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ కు డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకు న్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహి ష్కరణకు నిర్ణయం తీసుకున్నామని చెప్పార. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వచ్చినట్లు వివరించారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. బీఏసీలో నిర్ణయాలు ఒకటైతే.. సభలో పెట్టింది మరొకటని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సభను బూతుల మయం చేశారని హరీష్ వ్యాఖ్యానించారు.

సీఎం వ్యాఖ్యలపై నిరసనకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని వివరించారు. ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోతే సభకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ ఎలా అంటారని నిలదీసారు. ప్రధానిని రాహుల్‌గాంధీ విమర్శించడం లేదా అని ప్రశ్నించి న హరీష్.. మూసీ కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీని సీఎం గాంధీభవన్, సీఎల్పీ భేటీలా మారుస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి గన్‌పార్క్ వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. రేపు BRSభవన్‌లో కృష్ణా జలాలపై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. సీఎం రేవంత్ మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమన్నారు. తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటిగా నిలదీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications