కవిత రీయాక్టివ్- బ్యాక్ టు ఫామ్: ఫస్ట్ రియాక్షన్
K Kavitha: భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. రీయాక్టివ్ అయ్యారు. క్రియాశీలక రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయనున్నారు. త్వరలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత వరుస భేటీలను నిర్వహించనున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆమెకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు రెండు రోజుల కిందటే బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొన్నారు కవిత.

తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆ తరువాత సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. 165 రోజుల పాటు ఈడీ, సీబీఐ అధికారుల జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగారు. మొదట్లో బెయిల్ కోసం సాగించిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
వాటన్నింటినీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడీషియల్ కస్టడీని ఎప్పటికప్సుడు పొడిగిస్తూ వచ్చింది. ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటీషన్లపై సానుకూలంగా స్పందించలేదు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించిన తరువాత కవితకు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, మేనమామ హరీష్ రావు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024
తాజాగా- విడుదలైన తరువాత సోషల్ మీడియాలో తొలి పోస్ట్ పెట్టారు కవిత. సత్యమేయ జయతే అంటూ కామెంట్‌ను షేర్ చేశారు. కేటీఆర్, ఇతర పార్టీ నాయకులతో ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తోన్న ఫొటోను దీనికి యాడ్ చేశారు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతోన్నాననే సందేశాన్ని ఇచ్చారు.












Click it and Unblock the Notifications