Tummala Nageswara Rao: కాంగ్రెస్‍లోకి తుమ్మల నాగేశ్వర రావు..!

తుమ్మల నాగేశ్వర రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. అయినా కూడా తుమ్మలకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారు. దీంతో తుమ్మల ఏం చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేక ఇతర పార్టీల్లోకి వెళ్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచర వర్గం మాత్రం పోటీ చేయాల్సిందేనని తుమ్మల పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. తుమ్మల నాగేశ్వర రావు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఆయన్ కాంగ్రెస్ లోకి వెళ్తారా లేక బీజేపీలోకి వెళ్తారా అని చర్చ కొనసాగుతోంది.

అయితే బుధవారం తుమ్మల నాగేశ్వర రావును కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఇంటికి లోకల్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నాగేశ్వర రావు నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కూసుమంచి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ తో పాటు ఇతర నాయకులు తుమ్మలను కలిశారు. అశ్వారావు పేట మాడీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా తుమ్మలతో భేటీ అయ్యారు. అయితే తుమ్మల నాగేశ్వర రావుకు కాంగ్రెస్ చేరాలను అనుచరగణం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 BRS

తుమ్మల కూడా పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చిన ప్రచారం జరుగుతోంది. తుమ్మల కూడా తనను కలిసిన వారికి పార్టీ మారుతున్నట్లు హింట్ ఇస్తున్నారు. తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ చేరడం లాంఛనమేనని తెలుస్తోంది. వచ్చే మొదటి వారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 6న తుమ్మల కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఆ డేట్ రోజే తుమ్మల అనుచరులు హైదరాబాద్ లో భారీగా వాహనాలు బుక్ చేసుకున్నారు.

అయితే తుమ్మలకు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారానేది ప్రశ్నగా మారింది. తుమ్మల మాత్రం పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తే ఆమె పాలేరు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ తుమ్మలకు వస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి. పాలేరు కాకుంటే ఖమ్మం నుంచి తుమ్మలకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. కానీ తుమ్మల మాత్రం పాలేరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+