బీఆర్ఎస్ నేతలకు వింత జబ్బు, కవిత, కేటీఆర్‌లకు మరింత ఎక్కువ!

బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి పిచ్చిపిచ్చిా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదవి, అధికారం లేకుండా సేవ చేసే అలవాటు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.

మీడియా సమావేశాల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని కడియం శ్రీహరి విమర్శించారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

BRS leaders have a strange illness Kavitha and KTR have even more kadiyam Srihar

నాలుగేళ్ల తర్వాతే సాధారణ ఎన్నికలు వస్తాయని.. మళ్లీ అధికారంలోకి ఎవరు రావాలనేది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని కడియం శ్రీహరి చెప్పారు. ఇప్పుడే తొందరపడి.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు సోకిందనే అనుమానం కలుగుతోందని కడియం శ్రీహరి అన్నారు. వింత జబ్బు ఎక్కువగా కేటీఆర్, కవితలకే ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రానున్న అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+