దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాల్సిందే: స్పీకర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సోమవారం కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్ సమర్పించారు.
ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమకు హమీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దానం అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నారని గుర్తు చేశారు కౌశిక్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందన్నారు.
రేవంత్ రెడ్డి మాపై దెబ్బ కొట్టారు. మేం తీసుకున్నాం. మేం కొట్టే దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండండి. మా దెబ్బ పడ్డాక లేవడం మీ వల్ల కాదు. మేం గేట్లు తెరిస్తే మీరు భూస్థాపితం అవుతారు. జాగ్రత్త!! అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఈ అంశం స్పందించారు. దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దురదృష్టకరమన్నారు.
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన దానంపై అనర్హత వేటు వేయాలని శాసన సభాపతిని కోరామన్న వినోద్ కుమార్.. స్పీకర్ ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. తమ పిటిషన్‌పై త్వరగా తేల్చాలని ప్రసాద్ కుమార్‌ను కోరామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ పై అనర్హత పడ్డట్లేనని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇంకా వేచి చూడకుండా, సభాపతి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు.
పార్టీలు మారే వారిపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్, స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం దారుణమన్నారు వినోద్ కుమార్. ప్రభుత్వాన్ని కూల్చబోమని తాము స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. రేవంత్ తన పార్టీలో ఉన్నవాళ్లు పోకుండా చూసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులకు ప్రతిపక్ష పాత్ర ఒక వరమన్న వినోద్ కుమార్.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరని అనుకుంటున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీ వలసలను ప్రోత్సహించడం సబబు కాదని వినోద్ కుమార్ చెప్పుకురావడం గమనార్హం.












Click it and Unblock the Notifications