కవిత ఆరోపణల వేళ హరీష్ సంచలన వ్యాఖ్యలు..!!
బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది. కవిత ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. తన తండ్రికి లేఖతో మొదలైన కవిత వ్యాఖ్యలు... కాళేశ్వరం అవినీతి పై హరీష్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలు దుమారానికి కారణమయ్యాయి. దీంతో, పార్టీ నేతలతో చర్చించిన తరువాత కేసీఆర్ తన కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. కాగా.. కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. హరీష్ పైన తీవ్ర విమర్శలు చేసారు. లండన్ పర్యటన లో ఉన్న హరీష్ తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి హరీష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. హరీష్ కు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యల తరువాత కవితను సస్పెండ్ చేయటం తో పరోక్షంగా హరీష్ వైపే నిలబడినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక.. ఇదే సమయంలో లండన్ పర్యటనలో బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం అని, ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నర నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.

వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు. హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు. కాగా.. కవిత వ్యాఖ్యల తరువాత హరీష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కవిత పైన హరీష్ నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్ నాయకత్వం పైన విశ్వాసం ప్రకటించారు. కవిత పైన చర్యల ద్వారా హరీష్ కు కేసీఆర్ సైతం బాసటగా నిలిచినట్లు స్పష్టం అవుతోంది. తన కుమార్తె సీటు కోసం లండన్ వెళ్లిన హరీష్ తిరిగి వచ్చిన వెంటనే కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఆ తరువాత కవిత వ్యాఖ్యల పైన స్పందించే అవకాశం కనిపిస్తోంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications