Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana Assembly Elections 2023: ప్రచారం కోసం భారీగా వాహనాలు కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు..

ఒకప్పుడు రాజకీయనాయకులు అంబాసిడర్ కారు వాడే వారు. అప్పట్లో ఈ కార్లు అంటే మస్త్ కాయిష్ ఉండేది. ఆ తర్వాత కాలం మారేకొద్ది కొత్త కార్లు వచ్చాయి. ఆ తర్వాత ఇన్నోవాలు ఎక్కువగా వాడే వారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఫార్చునర్ కార్లు ఎక్కువగా వాడుతున్నారు. మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ దూకుడు పెంచింది.

115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి దాదాపు డజను పైగా వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పైసలతో సంబంధం లేకుండా వాహనాలు ఖరీదైనవిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఎమ్మెల్యేలు ఫార్చునర్లు, ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్ వంటి ఖరీదైన వాహనాలను కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యే సుమార్ 10 వాహనాలను కొనుగోలు చేశారు.

BRS MLA candidates are buying huge vehicles for campaigning

ఎందుకంటే ప్రచార సమయంలో గ్రామాలు, మండలాల్లో తమ అనుచర బలగంతో కార్లలో వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భరత్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇప్పటికే లేటెస్ట్ వెర్షన్ కార్లు కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పలు వాహనాలకు ఆర్డర్ ఇచ్చారట.

మిగతా వారు కూడా కార్లు కొనడానికి సిద్ధమయ్యారు. కొంత మంది కార్లు అద్దెకు తీసుకోనున్నారని తెలుస్తోంది. కొందరైతే పార్టీ ఫండ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నంతలో ప్రచారం చేయడానికి కార్లు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ఇప్పటికే గ్రామాల్లోని యువకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వారికి మందు, విందు ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+