హరీశ్ రావు వెనుక రేవంత్ రెడ్డి! (వీడియో)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు. తనకు ఎవరి భిక్ష వల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్(ట్విట్టర్)​లో పోస్ట్ చేశారు. 2005 జులై నాలుగో తేదీన మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను జతపరిచారు.

సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరామని పదవుల కోసం కాదన్నారు హరీశ్ రావు. తనకు మంత్రిపదవి వచ్చినపుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌​లోనే ఉన్నారని, ఆ ఊరేగింపులోనూ పాల్గొన్నారని హరీశ్ రావు గుర్తుకు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా తన వెనకే ఉండి నిక్కినిక్కి చూశారని పేర్కొన్నారు.

BRS MLA Harish Rao counter to Revanth Reddy Comments

ఇదంతా కళ్ల ముందు జరిగిందే కానీ, ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు హరీశ్ రావు. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర తమదని చెప్పారు.

పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ మినిస్టర్‌​గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌‌​గా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.

కేసీఆర్, హరీశ్ రావుపై రేవంత్ వ్యాఖ్యలు

దళితుడైన స్పీకర్​ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకనే కేసీఆర్​ సభకు రాలేదని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపణలు చేశారు. దళిత బిడ్డను అధ్యక్ష అని అనడం ఇష్టం లేకే కేసీఆర్​ సభకు రాలేదన్నారు. దళితుడిని అధ్యక్షా అనే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని తెలిపారు. దళితులను అవమానించిన కేసీఆర్​.. సభలో మాట్లాడాలంటే ఆ దళితులనే అధ్యక్షా అని అడుక్కునే పరిస్థితిని కాంగ్రెస్​ తీసుకొచ్చిందని చెప్పారు. కేసీఆర్‌​కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్​ అని.. వార్డు మెంబరైన హరీశ్​ రావును రాష్ట్ర మంత్రిని చేసింది రాజశేఖర్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీనే అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+