కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - ముహూర్తం సిద్దం..!!
బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తప్పటం లేదు. పార్టీ ముఖ్యనేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత పార్టీ తిరిగి కోలుకోకుండా కాంగ్రెస్ దెబ్బ తీస్తోంది. ఇప్పటికే కేకే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి నేతలు పార్టీ వీడారు. గ్రేటర్ మేయర్ తో పాటుగా హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ వల వేసింది. తాజాగా నగరం పరిధిలోని మరో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
బీఆర్‌ఎస్ నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలతో పాటుగా జిల్లా స్థాయిలోనూ మార్పులు వేగం పెరిగాయి. ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ వేగవంతం చేసింది. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ తమ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం ఇప్పటికే రేవంత్ ను కలిసారు. నగరానికి చెందిన మాజీ మంత్రి పేరు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. తాజాగా..అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువమంది గెలిచారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కీసరలోని ఓ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గం నేతలతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ రేపు(ఆదివారం) సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఎమ్మెల్యే వర్గం మాత్రం ఈ విషయం పైన స్పందించటానికి నిరాకరిస్తోంది. దీంతో, కాలేరు నిర్ణయం ఏంటనేది అధికారికంగా స్పష్టం కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications