బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఆందోళనకరం..!!
బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంత కాలంగా గోపీనాథ్ అస్వస్థతతో ఉన్నారు. కొద్ది నెలల క్రితం కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధిత చికిత్స తీసుకుంటున్న సమయంలోనే క్యాన్సర్ కు గురయ్యారు. ఇక, ఈ రోజు గుండె పోటు రావటంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గోపీనాథ్ కు క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్రంగా అవస్థ పడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిం చింది. ఈ చికిత్సలో ఉన్న సమంయలోనే క్యాన్సర్ రావటంతో అందుకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గోపినాథ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

పరిస్థితి విషమించటంతో ఆస్పత్రికి హరీష్ తో పాటుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకున్నారు. మాగంటి గోపినాథ్ ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.తొలిసారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ర్టం ఏర్పడటం, రాష్ర్ట విభజన జరగడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాడు. ఈసారి 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మూడోసారి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications