రేవంత్ రెడ్డితో హరీశ్ రావు, పద్మారావు భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు కలిశారు. అరగంటకుపైగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం హరీశ్ రావు, పద్మారావు మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని చెప్పారు.

తాము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారని.. 15 నిమిషాలపాటు రేవంత్ రెడ్డితో ఏమీ మాట్లాడలేదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆ తర్వాత పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించి వెంటనే సలహాదారు వేం నరేంద్ర రెడ్డికి ఓ పేపర్ ఇచ్చి పనులు పూర్తి చేయమని చెప్పారన్నారు. పద్మారావు రావాలని కోరడంతోనే తాను కూడా సీఎం వద్దకు వెళ్లానని హరీశ్ రావు తెలిపారు.

BRS MLAs Harish Rao and Padma Rao met Chief Minister Revanth Reddy

మరోవైపు, డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన సమావేశాన్ని బహిష్కరించామని హరీశ్ రావు చెప్పారు. చెన్నైలో జరిగే సమావేశం కాంగ్రెస్ నిర్వహించడం లేదన్నారు. డీఎంకే పార్టీ వాళ్లు పలిచారని.. తాము వెళ్తున్నామన్నారు. డీఎంకే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్ కమిటీ నివేదిక గురించి తనకు తెలియని హరీశ్ రావు తెలిపారు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదన్నారు. ఇది ఇలావుండగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా తన కటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు.

అసెంబ్లీలో హరీశ్ రావు వ్యాఖ్యల వివాదం

అసెంబ్లీలో చర్చ సందర్భంగా బుద్ధిమాంద్యం అంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారంటూ డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ కూడా వాదనలు ఎందుకంటూ ఘాటుగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+