లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. మే 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలిచ్చింది. కవిత కస్టడీపై పొడిగింపుపై సీబీఐ, ఈడీ అప్లికేషన్ లు దాఖలు చేశాయి. 14 రోజులపాటు కస్టడీకి పొడిగించాలని కోరాయి.

ఈడీ చెప్పిందే చెబుతోందని, కొత్త అంశాలను చెప్పడంలేదని, కస్టడీ అవసరం లేదంటూ కవిత తరఫు న్యాయవాది రాణా వాదించారు. ఆమె బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని, కస్టడీ పొడిగించాలంటూ ఈడీ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కేసు దర్యాప్తునకు సంబంధించిన పురోగతిని కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్ కు సంబంధించి ఛార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేస్తామంటూ తన క్లైంట్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆరోపిస్తున్నారని, కొత్తగా ఏమీ చెప్పడంలేదని రాణా వాదించారు.

brs mlc kalvakuntla kavitha in judicial custody till may 7th

మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. మద్యం కేసులో ఇప్పటికే కొంతమంది నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. వీటి ఆధారంగా కవిత నుంచి వివరణ కోరారు. ఆమె ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ మే 7వ తేదీవరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.

కవిత ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సూత్రధారిగా వ్యవహరించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని బెదిరించి రూ.14 కోట్లు వసూలు చేయడం, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు రాఘవద్వారా నగదు సేకరించడం, వాటిని తన వ్యక్తిగత కార్యదర్శిద్వారా హవాలా మార్గంలో ఢిల్లీకి చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ, ఈడీ వాదిస్తున్నాయి. ఆమె బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టు దృష్టికి తెచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+