ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత..హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన ఆమెకు నిరాశే ఎదురువుతోంది. కవిత ఈ ఏడాది మార్చి 15న మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు.

అప్పటి నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును మొదట సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆ తరువాత సీబీఐ జారీ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. 2024 మార్చి 15న బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి కవితను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించింది. కవిత అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications