ఈడీకి కవిత లేఖ - రేపు విచారణ: కొనసాగుతున్న ఉత్కంఠ..!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులతో ఉత్కంఠ కొనసాగుతోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. దీని పైన ఈడీకి కవిత లేఖ రాసారు. తాను విచారణకు సహకరించేందుకు సిద్దమేనని..రేపు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తనకు ఈ నెల 15వ తేదీ తరువాత విచారణకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నెల 10న ఢిల్లీలో దీక్షతో పాటుగా పలు కార్యక్రమాలు ఉన్నాయని లేఖలో వివరించారు. ఇప్పుడు ఈడీ ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తునేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో సూచించింది. దీని పైన కవిత ఇప్పటిచే స్పందించారు. తాను విచారణ సంస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేసారు. ఈ నెల 10న కవిత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షకు కవిత నిర్ణయించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో ఈ దీక్ష చేస్తున్నారు. ఇదే సమయంలో రేపు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. దీని పైన కవిత న్యాయసలహా తీసుకుంటున్నారు.

 BRS MLC Kavitha letter to Enforcement Direcrtorate, seek time for attend investigation before the Agency

ఇదే సమయంలో ఈడీకి కవిత లేఖ రాసారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా రేపటి విచారణకు హాజరు కాలేనని అందులో పేర్కొన్నారు. ఈ నెల 10న ఢిల్లీలో దీక్ష..తరువాతి కార్యక్రమాల కారణంగా ఈ నెల 15వ తేదీ తరువాత తనకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. విచారణకు సహకరిస్తానని స్పష్టం చేసారు. కవితకు మద్దతు ఆప్ నేతలు ముందుకొచ్చారు. తెలంగాణ మంత్రులు బీజేపీ తీరును తప్పు బడుతున్నారు. బీజేపీ నేతలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కవిత లేఖ రాయటంతో ఈడీ ఏం నిర్ణయం తీసుకుంటోందో చూడాలి. విచారణకు మరో సమయం కేటాయిస్తుందా లేదా అనేది ఉత్కంఠకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+