Mynampally Hanumantha Rao: మైనంపల్లి హనుమంతరావును తప్పించే యోచనలో బీఆర్ఎస్.. మరొకరికి అవకాశం..!
మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. మైనంపల్లిని కేసీఆర్ ఇప్పటికే మాల్కాజిగిరి అభ్యర్థిగా మారోసారి ప్రకటించారు. ఇప్పుడు మైనంపల్లి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని గులాబీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించిన తర్వాత పేరు ప్రకటించే అవకాశం ఉంది. మైనంపల్లి హనుమంతరావు ఈసారి ఎన్నికల్లో తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ కోరాడు.
తన కొడుకు మెదక్ లో టికెట్ ఇవ్వకుండా హరీశ్ రావు అడ్డుపడుతున్నట్లు మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. హరీశ్ రావు తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి విమర్శించారు. హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసినా మైనంపల్లి హనుమంతరావుకు సీఎం కేసీఆర్ మరోసారి మల్కాజిగిరి నుంచి అవకాశం కల్పించారు. ఇదే విషయాన్ని విలేకర్లు ప్రశ్నించగా.. అందరు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

మైనంపల్లి హనుమంతరావు గతంలో మెదక్ లో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు తన కుమారుడికి అక్కడ సీటు ఇవ్వాని కోరారు. హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ నియోజకవర్గంలో కొద్ది రోజులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తన కుమారుడికి, తనకు సీట్ మైనంపల్లి పట్టుబట్టారు. అయితే మెదక్ లో సిట్టింగ్ పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారని అధిష్ఠానం తేల్చి చెప్పింది. అయినా కూడా రెండు సీట్లు కావాలని మైనంపల్లి హనుమంత రావు డిమాండ్ చేశారు. పైగా హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో మైనంపల్లిపై పార్టీ అధిష్ఠానం కన్నేర్ర చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ పేర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డితో మరో రెండు పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మర్రి రాజశేఖర్ రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే మైనంపల్లి, అతడి కుమారుడికి టికెట్ ఇస్తారా అనేది డౌట్ గానే ఉంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications