రానున్న కాలం బీఆర్ఎస్‌దే, ఆర్ఎస్ ప్రవీణ్‌కు కీలక పదవి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంటుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తమ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన నివాసం ప్రవీణ్ కుమార్‌ను కండువా కప్పి ఆహ్వానించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీ నిర్మాణం చేసుకుందామని, కమిటీలు వేసుకుందామని తెలిపారు. రానున్న రోజుల్లో మనం అద్భుత విజయం సాధిస్తామన్నారు. బహుజన సిద్ధాంతం అమలు దిశగా దేశానికి తెలంగాణను టార్చ్ బేరర్‌గా చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కోటానుకోట్ల మంది బహుజనుల చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసినవాళ్లు. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. ఒకసారి కమిట్ అయినంక వెనక్కు రావద్దు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ నడుమ జరిగిన రివ్యూ లో మనవాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించిందన్నారు కేసీఆర్. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు కానీ, అట్లాంటి ఆలోచన సరికాదు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి. దళిత సమాజం దీన్ని పాజిటివ్‌గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి. దళిత శక్తితోపాటు బహుజన శక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిండు. దాన్ని మనం కొనసాగించాలన్నారు కేసీఆర్.
మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలి.. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే ఓ తీరు ఉండొద్దు. అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది.. ఇవి ఎక్కడ పోవు.. వచ్చేటయిన ఎక్కువిస్తాడేమో నని ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మల్లిండ్రు... ఇప్పుడు ప్రజలకు అర్థమైతున్నది వాస్తవం. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం అనుకుంటున్నారు ప్రజలు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!











Click it and Unblock the Notifications