సీఎం రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్..!!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే సత్తా చాటాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ 14 సీట్లలో గెలుపే టార్గెట్ గా ఫిక్స్ అయ్యారు. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 17 మంది అభ్యర్దులను ప్రకటించింది. ఈ సమయంలోనే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు.

కేటీఆర్ సవాల్
తెలంగాణలో పట్టు నిరూపించుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వరుసగా పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరిక, అటు బీజేపీ - కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీ తమ సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా వచ్చే నెల 13వ తేదీ నుంచి కేసీఆర్ వరుస ఎన్నికల సభ లకు నిర్ణయించారు. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి స‌వాల్ విసిరారు.

BRS working president KTR Challenge for CM Revanth ove contest in Malkajgiri loksbaha seat

పోటీ చేద్దాం..సిద్దం
ద‌మ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాల‌ని రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ద‌మ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని తనకు రేవంత్ స‌వాల్ విసిరారని కేటీఆర్ గుర్తు చేసారు. ఒక్క సీటు కూడా గెల‌వ‌రు అన్నావు క‌దా.. మ‌ల్కాజ్‌గిరి సీటులో పోటీ చేద్దాం. తేల్చుకుందాం రా అని అన్నానని వివరించారు. కానీ స్పంద‌న లేదన్నారు. మళ్లీ నోరు ఎత్త‌లేదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.మ‌ల్కాజ్‌గిరిలో ఈ ఐదేండ్ల‌లో రేవంత్ ఒక్క ప‌ని చేయ‌లేదని విమర్శించారు. రేవంత్‌కు ధైర్యం వ‌చ్చి రాజీనామా చేసి వ‌స్తే తాను వ‌స్తానని.. త‌ప్ప‌కుండా నిలబ‌డుతానని కేటీఆర్ పేర్కొన్నారు.

BRS working president KTR Challenge for CM Revanth ove contest in Malkajgiri loksbaha seat

పట్టు నిరూపించుకోవాలి
మ‌ల్కాజ్‌గిరిలో జ‌రిగే పోటీ.. కేవ‌లం వ్య‌క్తుల మ‌ధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మ‌ధ్య‌నేనని కేటీఆర్ విశ్లేషించారు. కేసీఆర్ నిల‌బ‌డ్డారని భావించి ప‌ని చేయాలని కేడర్ కు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్ల‌లో తుఫానులా మెజార్టీ ఇచ్చారని వివరించారు. మూడు ల‌క్ష‌ల యాభై ఓట్ల మెజార్టీ వ‌చ్చిందని లెక్కలు చెప్పారు. కాబ‌ట్టి ఇప్పుడు ఇత‌ర పార్టీలు మూడున్న‌ర ల‌క్ష‌లు దాటి ముందుకు వ‌చ్చి గెల‌వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్ర‌తి కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలని సూచించారు. కార్పొరేట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ప్ర‌తి ఇంటికి వెళ్లాలని కేటీఆర్ నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+