ఫ్యామిలీ పంచాయతీ మధ్యలో విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ..!
తెలంగాణలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం నేతల్ని కలవరపెడుతున్న అంశం. ఇందుకు తోడు నేతలు వరుసగా వలస బాట పడుతుండడం, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వడం చూస్తే కారు పార్టీ కాస్త షెడ్డుకి చేరిందా అనే అనుమానాలు రేకెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే మళ్లీ కేసీఆర్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు అనే తరుణంలో ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కవిత లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులను వివరిస్తూనే పాజిటివ్ లతో పాటు నెగిటివ్ విషయాలను సైతం లేఖ ద్వారా స్పష్టం చేయడం సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇచ్చింది. ఏపీలో జగన్ పై షర్మిల రివర్స్ అయినట్టు.. ఇక్కడ ఉదా కేటీఆర్ పై కవిత రివర్స్ కాబోతున్నారని.. త్వరలోనే సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించని కేటీఆర్.. ఇండైరెక్ట్ గా మాత్రం పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదన్నట్టు వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ లండన్, అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ పర్యటనలో ఆయన అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని.. అందుకోసం భారీ ఏర్పాట్లు సైతం చేసినట్టు టాక్ నడుస్తోంది.
అలానే లండన్ పర్యటనలో భాగంగా 'ఇండియా వీక్ 2025'లో కేటీఆర్ ఉపన్యాసం ఇవ్వనున్నారు. మే 30న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమోటివ్ బ్రాండ్లు.. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లకు ఆర్&డి సేవలు అందించే పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. పలు దేశాల మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులతో కూడా సమావేశం అవుతారని సమాచారం.












Click it and Unblock the Notifications