ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్ని రోజులు ఒక విషయాన్ని దాచిపెట్టా అంటూ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాగా రాజకీయంగా బీఆర్ఎస్, కేటీఆర్ కుటుంబం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. అసెంబ్లీ మొదలు.. గత మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ వరుస పరాభవలను ఎదుర్కొంటుంది. మరోవైపు కేసీఆర్ కుటుంబంలో పరిస్థితులు నేతలను సైతం అయోమయంలో పడేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత త్వరలోనే సొంతగా పార్టీ పెట్టబోతుండడం.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తుండడం సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ తరుణంలో కేటీఆర్ ఇలాంటి పోస్టు పెట్టడం ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది.

అసలేంటి ఆ పోస్ట్..

అయితే కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా పెట్టిన ఆ పోస్ట్ తన ఫిట్‌నెస్ గురించి అని తెలుస్తోంది. ఇన్ని రోజులు తన పొట్టను దాచలేక విసిగిపోయానని ఆయన ఫన్నీ కామెంట్‌ చేశారు. ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాను. జూలై నాటికి 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి నా శరీరాకృతి మారుతుందని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. ఇందుకు గాను జిమ్‌లో ఉన్న ఫొటోను పంచుకున్నారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. పాదయాత్రకు సిద్ధమవుతున్నావా అన్న అని ఒకరు కామెంట్ చేస్తే.. ఈ జిమ్ లు ఎందుకు అన్న.. నువ్వు ఆల్రెడీ బాగున్నావ్ అంటూ మరొకరు రాసుకొచ్చారు.

brs-working-president-ktr-latest-post-about-gym-and-diet-on-social-media-goes-viral

మరోవైపు తాను తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అవసరమైతే తన తండ్రి కేసీఆర్‌నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానని ఆమె వ్యాఖ్యానించారు. తన రాజకీయ పోరాటం డాడీ (కేసీఆర్), మోదీ, రేవంత్ రెడ్డిలతోనే ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీ నిలబడాలంటే ప్రత్యర్థులతో కొట్లాడక తప్పదని వ్యాఖ్యానించారు.

లేఖ లీకైనప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌లతో తాను మాట్లాడలేదని వెల్లడించారు. కాగా ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలంటూ కవిత దీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేసి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అయితే హైదరాబాద్‌లో కూడా ఆమె దీక్షకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+