సీఎం రేవంత్‌కు దమ్ముంటే - కేటీఆర్ సంచలన డిమాండ్..!!
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ లక్ష్యంగా ఛాలెంజ్ విసిరారు. మంచిర్యాల పార్టీ సమావేశంలో సీఎం పైన పలు ఆరోపణలు ఎక్కు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాతనపల్లిలో నీచ రాజకీయం చేశారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ అహం దెబ్బతిందన్నారు. దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూశారని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఇంత చేసినా.. ఈ మున్సిపాలిటీ ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్-సీపీఐ నేతలకు అభినందనలు తెలిపారు. వివేక్ ఫోన్ చేసి అడుక్కుంటే మున్సిపాలిటీని వదిలేసే వాళ్ళమని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తక్కువ స్థాయి మాటలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు.100 రోజుల్లో ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసారు. సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి బావమరిది నడుపుతున్నాడని ఆరోపించారు. సింగరేణిలో ఎవరైనా టెండర్ వేయాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారని తెలిపారు.

రేవంత్ ప్రభుత్వం పై విమర్శలు
అదే విధంగా మాట వినని కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఏసీబీ విచారణ కాదు.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
సింగరేణి మెడికల్ బోర్డు వెంటనే పెట్టాలని.. లేకుంటే ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతి బొగ్గు గనిలో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. కత్తి కాంగ్రెస్‌కు ఇచ్చి మమ్మల్ని కోట్లాడమంటే ఎలా అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ ఆయా నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ చెప్పినట్టుగానే భస్మాసుర హస్తం అయిందని గుర్తు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!













Click it and Unblock the Notifications