బిటెక్ విద్యార్థిని ఝాన్సీ హత్య కేసులో ట్విస్ట్: సిఐ బదిలీ
హైదరాబాద్: బిటెక్ విద్యార్థిని ఝాన్సీ తల్లి, భర్త మరి కొంత మందితో కలిసి చేసిన హత్య కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వర్లును బదిలీ అయ్యారు. ఆయన బదిలీపై నిరసన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో కొంత మంది పోస్టులు పెట్టారు. కొందరు రాజకీయ నేతల ఒత్తిడి కారణంగానే సీఐని బదిలీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా విది నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసీన నక్రేకల్ సీఐకి మాత్రం ప్రతి సామాన్యుడు హ్యాట్యాఫ్ చెప్తున్నారని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో తన కామెంట్ పెట్టాడు. ఝాన్సీ హత్య కేసులో తెలిసోతెలియకో ఒత్తిడి తెచ్చిన రాజకీయ నేతలు ఎక్కడ తాము పోలీసులపై తెచ్చిన ఒత్తిడి బయటకు వస్తుందో అనే భయంతోనే సీఐని బదిలీ చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు.

నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో భర్త విజయేందర్ రెడ్డి, తల్లి పద్మ పురుగుల మందు తాగించి హత్య చేసిన విషయం తెలిసిందే. కళాశాలలో ఫేర్‌వేల్ పార్టీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పినా వినకుండా బలవంతంగా కాలేజీ నుంచి తీసుకుని వచ్చారని, తనతో కాపురం చేయాలని భర్త విజయేందర్ రెడ్డి ఝాన్సీని హింసించాడని, ఆమె లొంగకపోవడంతో తల్లి పద్మతో కలిసి విజయేందర్ రెడ్డి పురుగుల మందు ఇచ్చి చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి, కన్నతల్లి గుర్రపు పద్మ హత్య చేయగా, ఝాన్సీ అన్న శివశంకర్‌రెడ్డి, ఆమె అత్త మామలు జయమ్మ, జానకిరాంరెడ్డి, మరిది అజయేందర్‌రెడ్డిలతోపాటు కారు డ్రైవర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ హత్యలో పరోక్షంగా భాగం పంచుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications