బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: విద్యార్థి మృతి

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

డివైడర్‌ను ఢీకొట్టగానే కారు పల్టీలి కొట్టి పూర్తిగా తిరగబడింది. ప్రమాదంలో చనిపోయిన యువకుడు కాలేజీ విద్యార్థి. బిటెక్ చదువుతున్నాడని తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

BTech student killed in Banjara Hills road mishap

పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్‌ వైపు అతివేగంగా వస్తున్న ఐ10 కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే, ఈ కారును నడిపిన సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+