హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 50 లక్షలు టోకరా: బ్యుటిషియన్ నందిని చౌదరి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చీటింగ్ కేసులో ప్రముఖ బ్యుటిషియన్, బ్లష్ లగ్జరీ స్పా అండ్ సెలూన్ యజమానురాలు యలమంచిలి నందిని చౌదరి (29)ని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను రిమాండ్‌కు తరలించారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 72లో నందిని చౌదరి బ్లష్ స్పా అండ్ సెలూన్‌ను నిర్వహిస్తోంది. దీంతో పాటు ఆభరణాల వ్యాపారం కూడా చేస్తోంది. తన స్పాకు వచ్చే సంపన్న మహిళలకు నగలు చూపించి అమ్ముతుంది. ఇందులో భాగంగా ఆమె హుస్సేనీఆలంకు చెందిన ఆభరణాల వ్యాపారి సోమెన్ ఘోష్ నుంచి అమ్మి పెడుతానని ఐదు నెక్లెస్‌లు తీసుకుంది.

Bueatician Nandini Chowdary arrested in cheating case

అయితే, వాటిలో మూడు నెక్లెస్‌లను పాన్ బ్రోకర్ వద్ద తనఖా పెట్టి రూ.10 లక్షలు తీసుకుని వాడుకుంది. మిగతా రెండు నెక్లెస్‌లు అప్పు తీర్చేందుకు ఇద్దరికి ఇచ్చేసింది. ఐదు నెక్లెస్‌లకు గాను ఆమె సోమేష్ ఘోష్‌కు రూ. 50 లక్షలు ఇవ్వాల్సి ఉండింది.

నగలను సొంతానికి వాడుకున్న నేపథ్యంలో నందిని చౌదరి సోమేన్ ఘోష్‌కు ముఖం చాటేసింది. దీంతో అతను నందిని చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై ఐపిసి సెక్షన్ 420, 406. 506ల కింద కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

English summary
Hyderabad Jubileehills police arrested bueatician Nandini Chowdary in cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X