కెసిఆర్, బాబుల బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అదుర్స్: ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉపయోగించనున్నారు.
తొలుత కెసిఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొన్నది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు కోసం రూ.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చింది. దీనిని చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ఉపయోగించనున్నారు.
కెసిఆర్, చంద్రబాబుల బుల్లెట్ ప్రూఫ్ బస్సుల పైన విమర్శలు కూడా వచ్చాయి. నిధులు లేవంటూ బస్సుల కోసం ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

కెసిఆర్ బస్సు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం అన్నిహంగులతో కూడిన అత్యధునాతన బస్సు గత జూలై మొదటి వారంలో హైదరాబాదుకు చేరుకుంది. దానికి పూజలు కూడా జరిగాయి.

కెసిఆర్ బస్సు
చండీగఢ్‌లో రూపొందించిన ఈ బస్సు పూజలు జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చేరుకుంది. అక్కడ పూజలు చేశారు.

చంద్రబాబు బస్సు
అత్యధునాతన హంగులతో చంద్రబాబు కోసం కూడా చండీగఢ్‌లో బస్సు తయారయి, ఇటీవలే విజయవాడకు వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనకు, అతిథిగృహంతో సంబంధం లేకుండా వాహనంలోనే బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను బస్సులో చేశారు.

చంద్రబాబు బస్సు
భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండే విధంగా అద్దాలతో సహా అంతా బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించే విధంగా దాన్ని రూపొందించారు. టైర్లను తూటాలతో పేల్చినా కూడా 30 - 50 కిలోమీటర్ల వరకు బస్సు సాఫీగా ప్రయాణిస్తుంది.

చంద్రబాబు బస్సు
జెసిబీఎల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్‌తో కలిసి ఈ బస్సును తయారు చేసింది. ఈ బస్సులో కార్యాలయం ఏర్పాటు కూడా ఉంటుంది. ఆరుగురు ఏడుగురు కూర్చునే విధంగా సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉంటుంది.

చంద్రబాబు బస్సు
దాని వెనక సిఎం కోసం ప్రత్యేక గది ఉంటుంది. 15, 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకునేందుకు రివాల్వింగ్ చైర్, రాత్రి వేళ నిద్రపోవడానికి పరువు ఉంటాయి.

చంద్రబాబు బస్సు
బస్సు వెనక భాగంలో స్నానాల గది ఉంటుంది. టీవీ, ఫ్యాక్స్, ఇంటర్నెట్, వైఫై, ప్రింటర్ సదుపాయాలు కూడా ఉంటాయి.

కెసిఆర్, బాబుల బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అదుర్స్: ఇలా.. (పిక్చర్స్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications