హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురు ఫ్రెండ్‌పై వ్యాపారవేత్త లైంగిక దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కన్ను మిన్ను కానని ఓ వ్యాపారవేత్త తన కూతురు స్నేహితురాలి పట్లనే అసభ్యంగా ప్రవర్తించాడు. సికింద్రాబాదులోని బోయిన్‌పల్లికి చెందిన రాజు అనే వ్యాపారవేత్త తన కూతురు స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడమే కాకుండా ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

రాజును పోలీసులు అరెస్టు చేసి సోమవారంనాడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. రాజు అనే వ్యాపారవేత్త బోయిన్‌పల్లిలోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రాజు కూతురు ఐదు రోజుల క్రితం తన స్నేహితురాలిని ఇంటికి తీసుకుని వచ్చింది.

Businessman arrested for sexually assaulting daughter’s friend

తన కూతురు మంచినీళ్లు తాగడానికి వంటింట్లోకి వెళ్లిన సమయంలో రాజు తన భార్య సదా చూస్తుండగానే అమ్మాయి చేయి పట్టుకుని, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

సమయానికి తన స్నేహితురాలు రావడంతో ఆమె ఆ వ్యాపారవేత్త చేతుల్లోంచి బయటపడింది. దాంతో ఆ అమ్మాయి వ్యాపారవేత్త రాజుపై, ఆయన భార్య సదాపై బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Bowenpally police have arrested a 46-year-old businessman, Raju, for allegedly misbehaving with his daughter's friend. The accused has been remanded in judicial custody on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X