ఉపఎన్నికలకు రెడీగా ఉండండి!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. కచ్చితంగా ఏప్రిల్ 27వ తేదీ నాడు.. వరంగల్‌కు తరలిరావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

పదేండ్ల పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా కేసీఆర్ పరుగులు పెట్టించారు. మొన్నటి ఎన్నికల్లో మనం ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ.. కానీ మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది. ఇది అక్షర సత్యం, వాస్తవం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్న పోసుకున్నట్లయిందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటన్నీ బోగస్ అని.. 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందని వ్యాఖ్యానించారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలున్న కాంగ్రెస్ నేతలను హైడ్రా ముట్టుకోదని కేటీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని అన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్న అనుకుంటే అది వారి అజ్ఞానం. రేవంత్ రెడ్డి మీద నోరుపారేసుకుని మన నోరును కరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మత పిచ్చి అనేది మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట. 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు శత్రువులేనని వ్యాఖ్యానించారు. ఇక, ఉపఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయన్న కేటీఆర్.. అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications